స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి అంజలి ఘటించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనంకు ఆరు ఎకరాల 80 సెంట్లు స్థలం కేటాయింపు పై హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు(కొండబాబు ) మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు దశ దిశ రూపొందిస్తున్న వెజినరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరజీవి పొట్టి శ్రీరాములు రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తిస్తూ ఆయన ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర రాజధాని అమరావతిలో అమరజీ పొట్టి శ్రీరాములు ట్రస్ట్ కు 6 ఎకరాల 80 సెంట్లు స్థలం కేటాయించి 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని నెలకొల్పి స్మృతి వనం ఏర్పాటు చేయడం మా ఆర్యవైశ్యులందరికీ ఎంతో ఆనందంగా ఉందని స్మృతి మనం పెట్టే ప్రాంతం ఒక పర్యాటక ప్రాంతంగా బాసిల్లడానికి కుటమి ప్రభుత్వం చేస్తున్న ఇంతటి మహత్కార్యాన్ని స్వాగతిస్తూ అర్థం వ్యక్తం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి లోకేష్ కి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ కి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బి నూకబాబు, కంచర్ల శ్రీనివాస్, కంచర్ల బాబు, కొత్త నాగ పండు, వి రాధాకృష్ణ రావు, కొత్త రాము, కొత్త వీర్రాజు, కొత్త నాగేశ్వరరావు, వి వెంకటేశ్వరరావు, మాతంశెట్టి సాయిబాబా, మాతంశెట్టి నారాయణ, మానేపల్లి నానాజీ, కొత్త శ్రీను, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.