Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications

ఘనంగా చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం, ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణమండపం సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ బహుళ అమావాస్య పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో..

 

విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్;

రాజమండ్రి జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణమండపంలో రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం, ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణమండపం సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం దేవాంగ కుల దేవత శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మ వారి జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుతూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గణపతి పూజ,సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు,ఈ సందర్భంగా అమ్మ వారికి పువ్వులు,పండ్లు,పలురకాల మిఠాయిలతో ఆషాఢ సారె,చీరలు సమర్పించారు. అనంతరం దేవాంగ మహిళలు భారీ ఎత్తున అమ్మవారి సారె ఊరేగింపు రాజమండ్రి పురవీధుల గుండా కొనసాగింది.రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు,మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు లు పాల్గొని అమ్మవారి పూజలలో పాల్గొన్న దేవాంగ మహిళలకు, సోదరులులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రొబ్బి విజయ శేఖర్, ప్రధాన కార్యదర్శి కాలెపు సత్యనారాయణ మూర్తి,చింతా వెంకట చలపతిరావు, బీరా శ్యామలరావు,బళ్ళా సత్యనారాయణ, ద్వారా పార్వతి సుందరి, అల్లాడ శ్యామల దేవి,బొమ్మన గౌరీ,కొమ్మన వెంకటేశ్వరరావు,గంపా సోమలింగేశ్వరరావు,బీరా పద్మనాభం,బళ్ళా శ్రీనివాసరావు,ఆకాశపు గోపాలరావు,బత్తుల రాజ రాజేశ్వరరావు,మావూరి బాబూరావు,బోడా ఆనందరావు, ఆశపు మల్లిబాబు,అల్లక సాంబం తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo