తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదానం..జగ్గంపేటలో అభినందనీయమైన సేవా కార్యక్రమం
జగ్గంపేట లో స్థానిక పాత పోలీస్ స్టేషన్ ఆవరణ ఈ మధ్యకాలంలో ఓ విశిష్టమైన సేవా కార్యక్రమానికి వేదికవుతోంది. ప్రతి మంగళవారం ఉదయం డొక్కా సీతమ్మ క్యాంటీన్ పేరుతో అనేక మంది పేదలకు ఉచితంగా భోజనం వడ్డించబడుతోంది. ఈ కార్యక్రమం జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జరుగుతోంది.
మంగళవారం జరిగిన క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం స్వయంగా ఆహారం వడ్డించడంతో పేదల ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, దినసరి కూలీలు – ఇంత మంచి భోజనం చాలా కాలం తర్వాత తింటున్నాం అంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు.ఈ సందర్బంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ మన నేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో, డొక్కా సీతమ్మ త్యాగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఈ క్యాంటీన్ ప్రారంభించాం. ఎన్నికల తర్వాత కూడా నిరంతరంగా కొనసాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా పేదల ఆకలిని తీర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది ఏ రాజకీయ కార్యక్రమం కాదు. శుద్ధంగా మానవతా దృక్పథంతో చేస్తున్న సేవా యజ్ఞం అని పేర్కొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మాధపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, గంధం శ్రీను, సత్తి సోమరాజు, అంకం ఓం, శ్రీమన్నారాయణ, డ్రిల్ మాస్టర్, పులిప్రసాద్, శివరామకృష్ణ, మిరియాల రాజు, పార్సీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు