Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications

ఆగని క్రెడిట్ కార్డు మరియు అన్ సెక్యూర్ లోన్ అప్లికేషన్ల రికవరీ ఏజెంట్ల ఆగడాలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఆర్బీఐ మార్గదర్శకాలను విస్మరించే వ్యవస్థపై తీవ్ర ఆందోళన

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డులు (ఎస్‌బీఐ, ఆక్సిస్, ఆర్‌బిఎల్, వన్‌కార్డ్) మరియు డిజిటల్ లోన్ అప్లికేషన్లు (మనీ వ్యూ, మొబిక్విక్, క్రెడిట్ బీ తదితరులు) ద్వారా తీసుకున్న లోన్లపై రికవరీ ఏజెంట్ల దురుసు ప్రవర్తన ఆందోళనకరంగా మారింది. నెలవారీ బిల్లింగ్ లో కనీస డ్యూ మాత్రమే చెల్లిస్తూ వచ్చిన వినియోగదారులు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా బకాయిలు చెల్లించలేకపోతే తీవ్ర వేధింపులకు గురవుతున్నారు.వినియోగదారుల మొబైల్ నెంబర్లకు కస్టమర్ కేర్ నుంచి వరుస కాల్స్, అలాగే వారి ఇళ్లకు రికవరీ ఏజెంట్ల అనుసరణ సాధారణం అయిపోయింది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం రికవరీ ఏజెంట్లు వినియోగదారులను కలవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి, అనుమతి లేకుండా వారి ఇంటికి వెళ్లే హక్కు లేదు.
అంతేకాక, వినియోగదారులు డిజిటల్ లోన్ అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చేసినప్పుడు వాటికి ఇచ్చిన ఫోన్ పర్మిషన్స్ ద్వారా వారి సంపూర్ణ కాంటాక్ట్ లిస్టు ఆయా సంస్థల వద్దకి చేరుతుంది. బిల్లు చెల్లింపులు ఆలస్యం అయినప్పుడు, రికవరీ ఏజెంట్లు ఈ కాంటాక్ట్ లిస్ట్‌లోని వారి బంధువులు, స్నేహితులు, అక్కచెల్లెమ్మలతో మాట్లాడి మీ పేరు మీద లోన్ తీసుకున్నారు ఇంటికి వస్తున్నాం అంటూ బెదిరింపు ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఇది రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు పూర్తి విరుద్ధం.ఈ విధంగా వినియోగదారుల గౌరవాన్ని, వ్యక్తిగత గోప్యతను భంగం చేస్తూ మానసిక హింసకు గురిచేస్తే, చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుతం బ్యాంకుల్లో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల ద్వారా లోన్ తీసుకోవాలంటే ఆధార్, పాన్, ఫింగర్‌ప్రింట్ తదితర ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. కాబట్టి మీ అనుమతి లేకుండా మీ పేరు మీదగా ఇంకెవ్వరూ లోన్ తీసుకోవడం సాధ్యపడదు. ఒకరు తమ ఫోన్ నెంబర్ ఇవ్వడంతో, ఇంకొకరిపై లోన్ వేయడం సాధ్యం కాదు. లోన్ మంజూరుకు ఆధార్, పాన్, ఫోటో, బ్యాంక్ వివరాలు, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ వంటి దశలు అవసరం. ఒకరి అనుమతి లేకుండా ఇంకొకరి పేరుతో లోన్ మంజూరవడం పూర్తిగా అసాధ్యమైనది. దయచేసి ప్రజలు కంగారు పడకుండా చట్టాన్ని ఆశ్రయించాలి.అంతేకాక, ఈ విధమైన వేధింపులు ఎదుర్కొంటున్న వారు తక్షణమే ఆర్థిక సంస్థల అధికారిక కంప్లయింట్ చానళ్లను, లేకపోతే నేరుగా పోలీసులను ఆశ్రయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మనిందిత నిర్ణయాలు తీసుకోకూడదు. చట్టపరంగా ఇది నేరంఇలాంటి ప్రవర్తనలను ఎదుర్కొన్న బాధితులు క్రింది చట్టాల కింద కంప్లైంట్ ఇవ్వవచ్చు:ఐటీ యాక్ట్ 2000 (Section 66E) – ప్రైవసీ ఉల్లంఘనకు ఐపీసీ సెక్షన్ 506 – బెదిరింపులకు
కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 – అభ్యంతరకర రికవరీ పద్ధతులకు ఆర్బీఐ “ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్” ఉల్లంఘన – చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చుఅవగాహన లేక మోసపోతున్న వినియోగదారులుఇలాంటి వేధింపులకు గురైతే ఏమి చేయాలి?ఆర్బీఐకి కంప్లైంట్ ఇవ్వండి – https://cms.rbi.org.in సైబర్ క్రైమ్ పోర్టల్ – https://cybercrime.gov.in సహాయం కోసం హెల్ప్‌లైన్ – 1930 (సైబర్ క్రైమ్) లేదా 155260 (ఫైనాన్షియల్ ఫ్రాడ్) సంప్రదించండి

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo