బాధ్యతతో అనుమతులు చూపించమన్న ప్రజలు…
మున్సిపల్ మరియు ఆర్ & బి అధికారులిచ్చిన అనుమతులు ఉన్నాయా అని అడుగగా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన ప్రైవేట్ కేబుల్ వర్తకులు…
ఇటీవల మండపేట పట్టణంలో కలువపువ్వు సెంటర్ నుండి కే పి రోడ్ లలో 3 రోజులుగా ప్రైవేట్ కేబుల్ నెట్వర్క్ వారు తమ ఇష్టానుసారం దృఢంగా ఉన్న సిమెంట్ రోడ్ ను డ్రిల్లింగ్ ట్రాక్టర్ మిషన్ తో గోతులు పెట్టి పాడుచేస్తున్న వారిని కే పీ రోడ్ లో గల రావి చెట్టు దగ్గర నివాసం ఉంటున్న నివాసిస్తులు తమ ఇంటి ముందు గోతులు పెట్టడాన్ని గమనించి వారిని నిలువరించి మీ వద్ద మున్సిపల్ మరియు ఆర్ & బి అధికారులిచ్చిన అనుమతులు ఉన్నాయా అని అడుగగా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన ప్రైవేట్ కేబుల్ వర్తకులు. అనుమతులు మీ వద్ద లేకుండా ఎలా మీరు ప్రజల ఆస్థిని మీ ఇస్టానుసారం తవ్వుతున్నారని బాధ్యతతో అడిగిన ఆ నివాసిస్తుడికి ఆధారాలు చూపించలేక అక్కడ నుంచి జారుకుని వేరే చోట తవ్వుతున్న ప్రైవేట్ కేబుల్ వారికి అదే చేధు అనుభవం ఎదురవడం జరిగింది. ఇది గమనించిన కే. పి. రోడ్డు లో నివాసం ఉంటున్న నివాసితులు అసహనంతో భాహాటంగానే ఆర్ & బి మరియు మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేకుండా రోడ్డులు తవ్వేయడమే కాకుండా ఆ గోతుల్లోంచి బయటకు తీసిన మట్టిని అక్కడే వదిలేయడంతో రెండు రోజులుగా వస్తున్న వర్షానికి రోడ్డంతా బురధ పాకడంతో వాహనదారులు పాదచారులు ఆ బురధలో జారి యాక్సిడెంట్ లకు గురవుతున్నా పట్టించుకోకపోవడం, ప్రైవేట్ కేబుల్ నెట్వర్క్ వారికి సంబంధిత డిపార్ట్మెంట్ వారు అనుమతులిచ్చిన పత్రాలు కూడా లేకపోవడం చూస్తుంటే పాలకపక్ష కౌన్సిల్ మరియు కూటమి నేతలకు ప్రజల సంరక్షణ గుర్తుందా అంటూ భాహాటంగానే చర్చించుకుంటున్నారు.