జగ్గంపేటలో నిరసన ర్యాలీ
తహసిల్దార్కి వినతిపత్రం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో జీవనోపాధి దెబ్బతిన్నందున తమ సమస్యలను పరిష్కరించాలని ఆటో కార్మికులు మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం చేపట్టి నినాదాలు చేశారు.తరువాత తహసిల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ గత పదేళ్లుగా ఆటో వృత్తిపైనే ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న తాము ఉచిత బస్సు పథకం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం అభినందనీయమే కానీ దాని వలన ప్రత్యక్షంగా దెబ్బతిన్న ఆటో కార్మికులకు ఉపశమన మార్గాలు చూపించడం అంతకంటే ముఖ్యమైనదని దీని వలన పేదరిక రేఖకు దిగువన ఉన్న ఆటో కార్మికులుకు రోజువారీగా తమకు దొరికే ఆదాయం కోల్పోతున్నాం అని వారు వాపోయారు.అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూని కలసి తమ వేదనను వివరించనున్నట్లు తెలిపారు.ఈ నిరసనలో జగ్గంపేట, పరిసర గ్రామాల నుండి వచ్చిన వందలాది ఆటో కార్మికులు పాల్గొన్నారు.

