Monday, August 4, 2025
Monday, August 4, 2025

జూలై 5న జగ్గంపేటలో మెగా జాబ్ మేళా

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిరుద్యోగ యువత కోసం బడా అవకాశం వచ్చి చేరింది. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ శనివారం నాడు జగ్గంపేట గోకవరం రోడ్డులోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా జరుగనున్నది. ఈ జాబ్ మేళా బ్రోచర్ ను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వికాస పిడి లక్ష్మణరావు సారథ్యంలో గోకవరం రోడ్డులోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వికాస పిడి లక్ష్మణరావు మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సుమారు 33 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. వీటిలో సాఫ్ట్‌వేర్, ఫార్మా, బ్యాంకింగ్, బిపిఓ, టెక్నికల్ తదితర రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి.సుమారు 1,350 ఖాళీ ఉద్యోగాలు ఈ జాబ్ మేళాలో అందుబాటులో ఉండబోతున్నాయి. పదో తరగతి నుండి పీజీ వరకు చదివిన, 45 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.13,000 నుండి రూ.45,000 వరకు జీతం లభిస్తుందని, అలాగే ఉద్యోగం పెట్టి భోజనం, వసతి వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిరుద్యోగ యువకు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇది ఒక చక్కటి అవకాశం జిల్లాలోనే ఇలాంటి విస్తృత స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడం చాలా హర్షకరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్.వి.ఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, కందుల చిట్టిబాబు, చదరం చంటిబాబు, శీలం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo