ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రోడ్లు పైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తాం..బొజ్జ రామకృష్ణ హెచ్చరిక
బొజ్జ రామకృష్ణ హెచ్చరిక
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:
స్థానిక ఎలక్ట్రికల్ వర్కర్స్ పొట్ట కొడుతున్న ఇతర రాష్ట్రాల ఎలక్ట్రికల్ వర్కర్ల ను అడ్డుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ కోరారు. గురువారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న విక్రమ హాల్ వద్ద గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తక్కువ రేట్లకు పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కార్మికుల పనులు అడ్డుకునేందుకు స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.ఈ స్క్వాడ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా నగర వీధులలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న కార్మికుల వలన స్థానిక రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల కార్మికులు పనులు లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్డర్లు, తాపీ మేస్త్రీలు ఎలక్ట్రికల్ పనులను ఇతర రాష్ట్రాల కార్మికులు చేత తక్కువ రేట్లకు చేయించడం వలన స్థానిక కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. తమ ఉపాధికి గండి కొడుతున్న ఇతర రాష్ట్రాల కార్మికులను అడ్డుకునేందుకు స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్క్వాడ్ నెలకు 4 రోజులు పర్యటించి గుర్తింపు కార్డులు లేకుండా ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న కార్మికులను అడ్డుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 500 రోజులు దాటిందని అయినప్పటికీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఒక్క పథకం కూడా ప్రవేశ పెట్టలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫరోజులలో తాము అధికారంలోకి వస్తే 100 రోజులలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా చెస్ వసూలు చేస్తున్నారని,ఆ చెస్ నిధులు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి ఖర్చు చేయడం లేదని అన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఫ్రీ బస్సు తదితర సంక్షేమ పథకాలు అప్పులు చేసి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించలేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రోడ్లు పైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆకలితో మండిపోతున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రులు, రాజకీయ నాయకుల వార్తలకు ప్రాధాన్యత ఇచ్చే మీడియా వారికి భవన నిర్మాణ కార్మికుల ఆకలి చావులు పట్టవా అని మండిపడ్డారు.ఈ కార్యక్రమం లో సెక్రటరీ ఆసపు శ్రీనివాస్,వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, ఆర్గనైజర్ శ్రీమల వీరభద్రరావు, జాయింట్ సెక్రెటరీ గోవాడ కొండబాబు,కమిటీ మెంబర్లు ఉత్తరాల సోమేశ్వరరావు, నిమ్మలపూడి రవివర్మ,జనపే పూర్ణ చంద్రరావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.