ఈనెల 27వ తేదీన విజయవాడ ఆర్టీసీ డిపో పక్కన సితార సెంటర్లో డూo డి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ నేతృత్వంలో శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు టీవీఎన్ మాధవ్, ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా నుంచి ఎంపీలు సానా సతీష్, తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పి రాజశేఖర్, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, వరుపుల సత్య ప్రభ, యనమల దివ్య, పంతం నానాజీ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, పిఠాపురం టిడిపి ఇన్చార్జి ఎస్ వి ఎస్ ఎన్ వర్మ తదితరులను ఘనంగా సత్కరించి ఆహ్వానించమని కొత్త కొండబాబు తెలిపారు

