ePaper
Saturday, June 27, 2026
ePaper
Homeఎడిటోరియల్గాడాల గంగాలమ్మను దర్శించుకున్న జక్కంపూడి.

గాడాల గంగాలమ్మను దర్శించుకున్న జక్కంపూడి.

📰 Generate e-Paper Clip

కోరుకొండ మే 17 (విశ్వం వాయిస్ న్యూస్)

మండలంలోని గాడాల గ్రామదేవత మాతృశ్రీ గంగాలమ్మతల్లి జాతర మహోత్సవాలు అశేష భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం వైఎస్ఆర్సిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా గంగాలమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీసభ్యులు జక్కంపూడి రాజాకు తీర్థ ప్రసాదాలు అందజేసి, పూలమాలలు వేసి సాలువతో ఘనంగా సత్కరించారు. గంగాలమ్మ జాతర ముగింపును పురస్కరించుకొని భక్తుల సహాయ సహకారాలతో భారీ అన్న సమారాధన నిర్వహించారు. జక్కంపూడి రాజా అన్న సమారాధనలో పాల్గొని, పలువురిని ఆప్యాయతగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు, జడ్పిటిసి కర్రి నాగేశ్వరరావు, ఆలయ కమిటీసభ్యులు కొండపల్లి శివశంకర్, కొండపల్లి స్వామి, కోడూరి వెంకన్న, కొండపల్లి నాగేశ్వరరావు, పోరాపు వీరబాబు, కోడూరి శ్రీను పలువురు వైకాపా నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img