29 November 2025
Saturday, November 29, 2025

ఘనంగా జగ్గంపేట అన్న క్యాంటీన్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు కూల్ డ్రింక్స్ పంపిణీ చేసి అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులోని ఎన్టీఆర్ స్మారక మందిరం గత నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు టిడిపి యువనేత పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి పంపిణీ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు. నాగేంద్ర చౌదరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గత వైసిపి పాలనలో పేదలకు అన్న క్యాంటీన్ ద్వారా అందుతున్న ఆహారాన్ని లాక్కున్న ఘనత వారికే చెందుతుందని చంద్రబాబు ఆలోచనతో ఉచిత అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నామని దీనికి అన్ని విధాల సహకారం అందిస్తున్న పాలచర్ల నాగేంద్ర చౌదరి, నాయకులు, కార్యకర్త ఆర్థిక సహకారంతో నిర్వహించమని అన్నారు. నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత రాక్షస ప్రభుత్వం పేదల నోటికాడ అన్నాన్ని లాక్కోవడంతో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉండి కూడా పేదలకు అన్నదానం నిర్వహించాలని ఆదేశించడంతో జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో జగ్గంపేటలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సోమవారం ఉచిత అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, పో తుల మోహనరావు దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, కందుల చిట్టిబాబు, కుంచె రాజా నియోజకవర్గంలోని 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo