పాటంశెట్టి సూర్యచంద్ర..సామాజిక ఉద్యమకారుడు
ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు గత ప్రభుత్వం జగ్గంపేటలో జగనన్న కాలనీలో 2900 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారని, సుమారు 1000 మంది గృహాలు నిర్మించుకున్నారని సుమారు 500 గృహాలు నిర్మాణంలో ఉన్నాయని జగనన్న కాలనీలో గోతులు, బురద రోడ్లలో ప్రయాణించలేక, త్రాగడానికి నీళ్లు లేక కనీస వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని జగనన్న కాలనీ ప్రజలు తమ సమస్యలు పాటంశెట్టి సూర్యచంద్రకు తెలిపారు.ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం జగనన్న కాలనీలో స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మాణానికి ప్రభుత్వంసహకరించిందని రహదారి నిర్మాణం, త్రాగునీటి సదుపాయం చేయకపోవడం వల్ల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు సిమెంట్ రోడ్లు వస్తాయని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైందని ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి సిమెంట్ రోడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారని సిమెంట్ రోడ్ల నిర్మాణానికి సమయం పట్టేలా ఉంటే ప్రజలు రాకపోకలకు వీలుగా ఉండే విధంగా కనీసం రోడ్లమీద క్వారీ డస్ట్ అయినా వేయించాలని, త్రాగునీటి సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులు, పాలకులు వచ్చి జగనన్న కాలనీలో సమస్యలు పరిశీలించి తక్షణం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని కోరారు