స్థల పరిశీలన చేసిన ఫౌండేషన్ ప్రతినిధులు, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల, కాపు కళ్యాణ మండపం, వద్దగల ఖాళీ ప్రదేశాలలో రెండు చోట్ల స్టేడియాల నిర్మాణానికి జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, సాన సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ , ఇంజనీరింగ్ అధికార్లు స్థల పరిశీలన చేశారు .ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ జగ్గంపేటలో ఇండోర్ స్టేడియం కి మిగిలి ఉన్న పనులకు, పక్కనే ఉన్న స్థలంలో క్రికెట్ స్టేడియం, మరొక స్థలంలో మరో స్టేడియం నిర్మాణానికి సహాయం అందించవలసిందిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ని కలవడం జరిగిందని ఆయన వెంటనే స్పందించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, సానా సతీష్ ఫౌండేషన్ సహాయంతో నిర్మాణాలు చేపట్టిన ఈరోజు ప్రతినిధులు వచ్చి పరిశీలించారని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేపట్టి తొందరలోనే ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని నవీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి సర్వసిద్ధి లక్ష్మణరావు, మండల తెలుగు యువత అధ్యక్షులు రాయి సాయి, కోడూరి రమేష్, డి ఈ ఉమాశంకర్, జేఈ నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు