29 November 2025
Saturday, November 29, 2025

జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబుకి ఘన సత్కారం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక జేవియర్ అపార్ట్మెంట్ వద్ద జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు), సంఘ పెద్దలు కలిసి జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబుని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తకొండ బాబు మాట్లాడుతూ మా అందరి ఆరాధ్య దైవం జ్యోతుల నెహ్రూ ఆశీస్సులతో జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ సహకారంతో మండల టిడిపి అధ్యక్షులుగా నియమితులైన జీను మణి బాబుని ఘనంగా సత్కరించామని ఆయన ఆధ్వర్యంలో ఆర్యవైశ్య లలో పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా ఎమ్మెల్యే నెహ్రూ సహకారంతో అందేవిధంగా చూడాలని ఆర్యవైశ్యుల్లో పేదవారికి ఇళ్ల స్థలం ఇప్పించాలని కోరారు. మణిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు సహకారంతో ఎమ్మెల్యే నెహ్రూ, నవీన్ తో కలిసి మీ సమస్యలన్నీ పరిష్కరించి మీకు అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగార్రాజు, పాలకుర్తి సురేష్, బోండా వీరసత్య, కొత్త శ్రీరామకృష్ణ, దారా శ్రీనివాస్, బోండా రాజేష్, వి నాగసత్య, కంచర్ల బాబు, బొండాడ జగన్, పొట్టి రాజేష్, మానేపల్లి రామానుజ, కొత్త ప్రసాద్, ఉద్ద గిరి కామేష్, నీట్టాల శ్రీనివాస్ తదితర ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo