కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ జ్యోతుల నవీన్ కుమార్, చైర్మన్ 13 మంది సభ్యులతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రకటించడం జరిగింది. ఆ కమిటీలో కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన నియోజవర్గ టిడిపి నాయకులు వి వి బి ప్రసాదరావు ను నియోజవర్గ అభివృద్ధి కమిటీలో సభ్యుడిగా స్థానం కల్పించామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇర్రిపాకలో జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రకటించారు. సందర్భంగా భూపాలపట్నం ప్రసాద్ ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ సహకారంతో జగ్గంపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో నడిచే విధంగా ముందుకు నడిపిస్తామని అన్నారు.