01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

జగ్గంపేట శ్రీ ప్రజ్ఞ స్కూల్‌లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహణ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జగ్గంపేట నందు ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ఎంతో ఘనంగా సాగింది. ఈ సమావేశానికి స్కూల్ ఛైర్మన్ శ్రీ బండారు నాగబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమం ప్రారంభం ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల పరస్పర పరిచయంతో జరిగింది.ఈ సందర్భంగా స్కూల్ ప్రత్యేకతలు, విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయుక్తమైన విద్యా విధానాలపై చర్చించబడింది. విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, పిల్లలలో క్రమశిక్షణ, ఆచరణాత్మక విజ్ఞానం పెంపొందించేందుకు స్కూల్ తీసుకుంటున్న చర్యలపై వివరంగా వివరణ ఇవ్వబడింది.కార్యక్రమంలో పేరెంట్స్ కోసం మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ తదితర వినోదాత్మక ఆటల పోటీలను నిర్వహించారు. విజేతలకు స్కూల్ డైరెక్టర్ శ్రీమతి బండారు శ్వేత మొక్కలు బహుమతులుగా అందించారు.ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ సాయి దీప్తి మాట్లాడుతూ పిల్లలకు పాఠశాల విద్యతో పాటు సాంస్కృతిక కార్యకలాపాలు కూడా ఎంతో ముఖ్యమైనవి. తల్లిదండ్రులు సెల్ ఫోన్ల వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలలో ఫోన్‌కు వ్యసనం పెరగకుండా ఉండేలా తగిన శ్రద్ధ వహించాలి. అలాగే హోం వర్క్, చదువుల పట్ల ఆసక్తి కలిగించే బాధ్యత తల్లిదండ్రులదీ కూడా.” అని తెలిపారు.అంతేగాక, విద్యార్థుల విద్య సంబంధిత ఏవైనా సందేహాలుంటే తల్లిదండ్రులు తమ తమ క్లాస్ టీచర్లను ఒక ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం, చైర్మన్ బండారు నాగబాబు, డైరెక్టర్ బండారు శ్వేత, కాలేజీ ప్రిన్సిపాల్ అభి, స్కూల్ ప్రిన్సిపాల్ సాయి దీప్తి మరియు స్కూల్ స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తల్లిదండ్రుల నుంచి విశేష స్పందనను పొందింది.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo