కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు, శుక్రవారం జగ్గంపేట సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా డ్రిల్, ఇన్‌స్ట్రక్షన్ల తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా జరిగింది.ఈ శిక్షణా శిబిరానికి జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) వై.ఆర్.కె. శ్రీనివాస్ నేతృత్వం వహించారు. కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్‌ఐలు జి. సతీష్, రఘునందన్ రావు, శివ నాగబాబు, ఎం. రాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, “పోలీసుల విధి నిర్వహణలో మానసిక, శారీరక స్థాయిలో సిద్ధత అత్యంత అవసరం. ఈ తరగతుల ద్వారా శిక్షణతో పాటు వ్యవస్థపరమైన అవగాహన, నైపుణ్యం, క్రమశిక్షణ పెంపు వంటి అంశాల్లో పోలీసులు మెరుగయ్యే అవకాశముంది” అని పేర్కొన్నారు.సర్కిల్ స్థాయిలో ఈ విధంగా సమగ్రంగా నిర్వహించిన శిక్షణా తరగతులు, స్థానిక పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగుగా నిలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.