జక్కంపూడి రాజా దీక్ష భగ్నం దారుణం..
– ఇసుక దోపిడీ ఏ రకంగా చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు
– కూటమి పాలనపై విరుచుకుపడ్డ వైసిపి బిసి నాయకుడు బూడిద శరత్ కుమార్
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అరెస్టు అక్రమమని ఆంధ్ర రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సీనియర్ నాయకుడు బూడిద శరత్ కుమార్ విమర్శించారు.ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోందని ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అందుకే మద్యం స్కామ్ పేరుతొ మిథున్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేసారని విమర్శించారు.ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో నిరసన పెల్లుబికుతోందని, ఇక ఎవరూ ప్రశ్నించకూడదన్న ఉద్దేశ్యంతో మిథున్ రెడ్దని అరెస్ట్ చేసి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని శరత్ కుమార్ విమర్శించారు.
మరోపక్క పేపర్ మిల్లు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై యువనాయకుడు జక్కంపూడి రాజా తలపెట్టిన దీక్షను భగ్నం చేయడం దారుణమని శరత్ కుమార్ అన్నారు.500మంది పోలీసులను మోహరించి దీక్షను అడ్డుకోవడం శోచనీయమన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఇక్కడికక్కడ రాత్రికి రాత్రే ఇసుక ను స్టాక్ పాయింట్లనుంచి తరలించేశారని,అది చాలక గోదావరికి తూట్లు పొడుస్తూ ఇసుకను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.2029లో ప్రజలు మళ్ళీ జగన్ ని అధికారంలోకి తీసుకువస్తారని, అప్పుడు 2. 0పాలన ఎలా ఉంటుందో చూస్తారని ఆయన అన్నారు.