ముఖ్య అతిథిగా హాజరైన జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మల పల్లి రమేష్
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హై స్కూల్ చైర్మన్ ఎలుగుబంటి శ్రీను, సర్పంచ్ తోట అయ్యన్న, ఎంపీటీసీ గోకేడ రాజా, గోకేడ రాంబాబు, కాయల మణికంఠ, కాయల శ్రీను, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణ, టీచర్స్ సెక్రటరీ నూకరాజు, గోకేడ ప్రసాద్, గోకేడ సత్యనారాయణ, పంచాది నానాజీ, మాదారపు వీరబాబు, హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థి,విద్యార్థినులు పాల్గొన్నారు.