29 November 2025
Saturday, November 29, 2025

తెలుగుదేశం పార్టీలో చేరిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పసగడుగుల బాబురావు, రిటైర్డ్ ఎంఈఓ కంటే ఉదయ భాస్కర్ చౌదరి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పార్టీలోకిసాదరంగా స్వాగతించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పసగడుగుల బాబురావు, గండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ కంటే ఉదయ భాస్కర్ చౌదరి తమ అనుచరులు తో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టిడిపి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. అనంతరం సూపర్ సిక్స్ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు పాలన విధానాన్ని సమర్థిస్తూ జాయిన్ అవుతున్న బాబురావుకి, ఉదయ భాస్కర్ చౌదరికి స్వాగతం పలుతున్నానని ఇంతకాలం విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించిన వీరు పార్టీలోకి వచ్చి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రభుత్వానికి, పార్టీకి వారదులుగా పనిచేయాలని ఈ మంచి ప్రభుత్వానికి రిటైర్డ్ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు.ఈ సందర్భంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలతో పాటు రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో పనిచేయాలని ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కందుల చిట్టిబాబు, బుర్రి సత్తిబాబు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అధ్యక్షులు తోలేటి సూర్యనారాయణ, రిటైర్డ్ ఉపాధ్యాయులు కోన బాబురావు, మంచాల మల్లేశ్వరరావు, చంద్రమౌళి వెంకట శాస్త్రి, గోన చక్ర రావు, మామిడాడ టిడిపి నేతలు వేగి రామకృష్ణ,పెంట కోట సత్యనారాయణ, వేగి రాంబాబు, దేశెట్టి శ్రీనివాసరావు, అల్లు రామరాజు, కోరుమిల్లి రమణ, బొడ్డేటి అశోక్, దెయ్యాల సూర్యనారాయణ, అనిపెద్ది శ్రీనివాసరావు, దాడి వెంకటరమణ, వానపల్లి గంగాధర్, సుందరపు నాగు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo