అర్హులైన దివ్యాంగుల కోసం 30న ట్రైసైకిళ్ల పంపిణీ
జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ముందడుగు
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని టిడిపి కార్యాలయంలో జిల్లా టిడిపి విభిన్న ప్రతిభవంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర మీడియాతో మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులు ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టంచేశారు అని అన్నారు. వైసీపీ హయాంలో చాలా మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారని దీనివల్ల అర్హులకు నష్టం కలుగుతోందని అన్నారు. ఏ ఒక్క అర్హుడికీ నష్టం జరుగకూడదంటే అనర్హులను తప్పించాల్సి ఉందని చెప్పారు. అనర్హులను గుర్తించే ప్రక్రియలో ఎక్కడైనా లోపాలున్నా అధికార యంత్రాంగం పొరపాట్లు చేసినా దానిని గుర్తించి సరిదిద్దే బాధ్యతను టీడీపీ యంత్రాంగం తీసుకుంటుందని పిలుపిచ్చారు. తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్న వారికి నోటీసులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ పింఛను ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. దివ్యాంగుల పింఛన్లపై వైసీపీ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. దీనిపై ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తోందన్నారు. వైసీపీ తప్పులు చేస్తూ వాటిని ఎదుటివారిపైకి నెడుతోంది. దీన్ని మనం సమర్థంగా తిప్పికొట్టాలి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనైనా గతంలో ఏ ప్రభుత్వాలైనా ఈ స్థాయిలో పింఛన్లు ఇచ్చాయా అని వైసిపి ప్రభుత్వం లో 2019 నుండి 2024 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 3000 ఇచ్చిందని ఒక్క రూపాయి కూడా దివ్యాంగులకు పెంచలేదని ఆయన తీవ్రంగా వైసిపి పై మండి పడ్డారు. ఈనెల 30వ తేదీ శనివారం ఉదయం జగ్గంపేట రావులమ్మ నగర్ లోని టిడిపి కార్యాలయంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు మూడు చక్రాలు ట్రై సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుందని అర్హులైన దివ్యాంగులు ఎవరైనా ఉంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సదరం సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని అప్పన్న దొర అన్నారు.

