టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూను కలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ
స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర టిడిపి కార్యదర్శి కాకినాడ రూరల్ టిడిపి నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు ఆధ్వర్యంలో సామర్లకోట రూరల్ మండలం నవర గ్రామంలో నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి విగ్రహాలను అందించవలసిందిగా జగ్గంపేట శాసనసభ్యు లు జ్యోతుల నెహ్రూను కలిసిన గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధి నూకరాజు, రామదేవ సీతయ్య దొర, కేశవరపు సత్యనారాయణ, మేడిపోయిన వీర్రాజు, సిద్ధి సన్యాసిరావు తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వెంకటేశ్వర స్వామి నూతన విగ్రహాలు అందజేయవలసిందిగా జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ను కలిసి కోరడం జరిగిందని అన్నారు.