కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో వెలిసిన వరెళ్లమ్మ తల్లి 2వ వార్షికోత్సవం బుధవారం నీలం సురేంద్ర ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామమంతా పండుగ సందడితో కళకళలాడింది.ముందుగా గోనేడ సర్పంచ్ అల్లు విజయ్ కుమార్ వారి సతీమని పీటలు మీద కూర్చుని అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు .అనంతరం గరగలు తీసి ఊరేగింపుగా ఆనవాయితీ గా నీలం సురేంద్ర ఇంటిదగ్గర తీసుకుని వెళ్లడం జరిగింది.సురేంద్ర చెల్లులు ఇంటి ఆడపడుచు అమ్మవారి గరగలు కి హారతి ఇచ్చి సాగనంపారు అనంతరం పెద్ద రామాలయం వీధి నుండి చిన్న రామాలయం వరకు ప్రదక్షిణ నిర్వహించారు. ఈ ఊరేగింపులో మహిళలు, యువత, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని జై వరెళ్లమ్మ తల్లి అంటూ నినాదాలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వరెళ్లమ్మ తల్లి గ్రామ శ్రేయస్సుకు సంకేతమని, ప్రతీ ఏడాది జయంతి, వార్షికోత్సవాలను గ్రామస్తులంతా కలిసి ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారిందని తెలిపారు. ఈసారి ఉత్సవాలు ఆగస్టు 20 నుంచి 24 వరకు ఐదు రోజులపాటు నిర్వహించబడతాయని పేర్కొన్నారు.శనివారం అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగనుంది. అదే రోజు సాయంత్రం డాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. ఆదివారం గోనేడలో పండగ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో నీలం సురేంద్ర ,నీలం శ్రీనివాస్ , నీలం ఆదిబాబు ,తోట నాయుడు ,అడపా బద్రి,బదిరెడ్డి వెంకటేష్ , గండ్రోతు శివ ,మద్దూరి సత్యనారాయణ గ్రామ పెద్దలు గ్రామస్తులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకున్నారు.

