01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

పదవులకోసం కాదు – అభివృద్ధికోసమే రాజకీయాలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ ఎంపీ తోట నరసింహం చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, నరసింహం పదవులను వాడుకున్న విధానం, నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్రపై తీవ్రమైన ప్రశ్నలు గుప్పించారు.
తాను ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశానని చెప్పుకుంటున్నారు. అయితే, ఆ పదవుల వల్ల జగ్గంపేటకు వచ్చిన అభివృద్ధి ఏమీ కనిపించడంలేదు” అని నెహ్రూ వ్యాఖ్యానించారు.
2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్లు గుర్తుచేశారు. అదే సమయంలో తోట నరసింహం ఎంపీగా కొనసాగినా, తానకు అవసరమైన సహకారం అందించలేదని నెహ్రూ ఆరోపించారు.జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మల్లవరం ఎత్తిపోతల పథకం (రూ. 350 కోట్లు), రింగ్ రోడ్డు, సామర్లకోట–గోకవరం, కిర్లంపూడి–సామర్లకోట రోడ్లు వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు చేపట్టిన విషయాన్ని వివరించారు. కానీ అప్పటి ఎంపీ నరసింహం మాత్రం రాజుపాలెం–రామవరం రోడ్డును అడిగినా, దానిపై ఏ చర్యలు తీసుకోలేదని, రామవరం ప్రాంతంలో ఇంకా బారిన గుంతలతో రహదారి దుస్థితిలో ఉందని విమర్శించారు.మోడల్ డిగ్రీ కాలేజ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, జగ్గంపేటకు ఐదు కిలోమీటర్లు దూరంలో అడవిలో, విద్యార్థులు వెళ్లలేని ప్రదేశంలో శంకుస్థాపన చేయడం వల్ల కోర్టు మార్గంలో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆపై నడిబొడ్డులోనే అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశాంఅని చెప్పారు.మాజీ మంత్రి తోట నరసింహం తన శాఖకు చెందిన రిజిస్ట్రార్ కార్యాలయం కూడా నిర్మించలేకపోయారని, మంత్రి పదవిని వెలగబెట్టారని నెహ్రూ ఆరోపించారు.పుష్కర ఎత్తిపోతల పథకం కింద 63,000 ఎకరాల ఆయకట్టకు సంబంధించి తాళ్లూరు, రాజపూడి, యర్రంపాలెం, బొర్రంపాలెం లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడం, టిడిపి ప్రభుత్వం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం, తదనంతరం వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగిందన్న విషయాన్ని గుర్తుచేశారు.మల్లవరం ప్రాజెక్ట్‌కు రూ.130 కోట్లు కేటాయించి 20 శాతం పనులు పూర్తవగా, జగన్ రెడ్డి దానిని పక్కన పెట్టినప్పుడు నీవు ఇన్చార్జిగా ఉన్నావు. అప్పుడు ప్రశ్నించలేదు, నీవు చెప్పుకున్నట్టు అప్పటి ఎమ్మెల్యే చేతగానివాడు కాబట్టే నిన్ను పెట్టారట. మరి నీకు ఆ ప్రాజెక్ట్ కనపడలేదా?” అంటూ నెహ్రూ ప్రశ్నించారు.రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్రమంత్రి నితిన్ ఘడ్కరీని కలిసిన విషయాన్ని, అక్టోబరులో ప్రారంభం కానున్న ప్రాజెక్టుల వివరాలను విలేకరులకు చూపించారు. అలాగే కత్తిపూడి, సామర్లకోట, గోకవరం, కాకినాడ వంటి ప్రాంతాలను కలుపుతూ నియోజకవర్గానికి కచ్చితమైన కనెక్టివిటీ ఇచ్చేలా రోడ్డు ప్రణాళికలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు.బహిరంగ చర్చకు సిద్ధమా?” అంటూ తోట నరసింహానికి సవాల్ విసిరిన నెహ్రూ, ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని, పదవుల కోసం కాదని, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, బుర్రి సత్తిబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, జనసేన నాయకుడు ఉలిసి ఐ.రాజు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo