ఐసీడీఎస్ సిబ్బంది ఆందోళన
కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాజెక్ట్ పరిధిలోని గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల అంగన్వాడీ సిబ్బంది సోమవారం ఐసీడీఎస్ కార్యాలయానికి చేరుకొని పనిచేయని ఫోన్లు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. 2022లో అందించిన 2జీ స్మార్ట్‌ఫోన్లు పనిచేయకపోవడంతో, అవి ఉపయోగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.ఫోన్‌లలో యాప్‌లు పని చేయడం లేదని, గర్భిణీలు, బాలింతల వివరాలు నమోదు చేయడంలో సమయం తలెత్తుతోందన్నారు. ఫేస్ యాప్‌లో రిజిస్ట్రేషన్ గంటల తరబడి సమయం పడుతోందని విన్నవించారు. 5జీ ట్యాబ్‌లు అందిస్తే తాము సమర్థంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రాజెక్టు పరిధి అధ్యక్షురాలు సిహెచ్. రత్నం, కార్యదర్శి సుజాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.