Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుండి ఏలేరు రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసిన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్య ప్రభ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జగ్గంపేట మండలం రామవరం వద్దగల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేజ్ టు నుండి ఏలేరు రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసేందుకు ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జగ్గంపేట, ప్రత్తిపాడు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్య ప్రభ పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఎం శ్రీనివాసరావు హాజరయ్యారు. వారికి ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి ఏలేరు రిజర్వాయర్ లోకి లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం గంగమ్మకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ లోకి నీటిని నింపేందుకు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటుచేసిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుండి నీటిని విడుదల చేసామని ఈ ఏలేరు రిజర్వాయర్ చూసుకుంటే పది టీఎంసీల నీరు మాత్రమే ఉందని దీనివల్ల రాబోయే రోజుల్లో ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలుగుతుందని మేమందరం కలిసి నీటిని విడుదల చేశామని ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్టు కమిటీ ఏర్పడిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొదటి కార్యక్రమం అన్నారు. ప్రాజెక్టులోకి వచ్చే నీరు 500 క్యూసెక్కులు రావాల్సి ఉండగా 2200 క్యూసెక్కులు వస్తుందని పది రోజులుగా 900 క్యూసెక్కుల నీరు బయటికి పంపుతున్నారని నాట్లు వేయడం మొదలుపెట్టారు. కాబట్టి 12 వందల క్యూసెక్కుల నీటిని వదలాలని దానివల్ల థాలాండ్ వరకు నీరు వెళ్లే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఏలేరు ఆయకట్టులోని కాలవలను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసుకుని రాబోయే రోజుల్లో రెండు పంటలకు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని నీటి సామర్థ్యం పెంచేందుకు పురుషోత్తపట్నం నుండి ఆరు టీఎంసీలు నీటిని లిఫ్ట్ చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నామని నెహ్రూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఊట ఆది విష్ణు, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, బిజెపి ఇన్చార్జ్ దాట్ల కృష్ణ వర్మ, అడబాల వెంకటేశ్వరరావు, వీరం రెడ్డి కాశి బాబు, పాఠం శెట్టి మురళీకృష్ణ, భూపాలపట్నం ప్రసాద్, పాఠం శెట్టి రవి, నీలం శ్రీను, కుర్ల చినబాబు, డి.శ్రీనివాసులు ఈ ఈ వి ప్రసాద రావు డి ఈ ఈ ఎస్ ఉమాదేవి ,ఏ ఈ ఈ ఎస్.నవీన్ ,సంతోష్ ఏ ఈ ఈ రజనీకాంత్ ,ఏ ఈ ఈ జగంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల కూటమి నాయకులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo