29 November 2025
Saturday, November 29, 2025

ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా నడిపిందుకే స్మార్ట్ రేషన్ కార్డులు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ప్రజల సంక్షేమం కొరకే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు

జగ్గంపేట శాసనసభ్యులు టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చే ప్రజా సంక్షేమ కోసం కృషి చేస్తున్నారని మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్, దీపం పథకం, తల్లికి వందనం , అన్నదాత సుఖీభవ , స్త్రీ శక్తి ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన రామవరం సచివాలయం1 వద్ద స్మార్ట్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో పగడ్బందీగా స్మార్ట్ రేషన్ రూపకల్పన జరిగిందన్నారు.ఇప్పుడు వరకు ఉన్న రేషన్ కార్డులో ఆ కుటుంబానికి చెందిన సభ్యులందరితో ఫోటో ఉండేదని, ఇప్పుడు ఆ స్థానంలో కుటుంబ యజమాని ఫోటో ఉంటుందని తెలియజేశారు.స్మార్ట్ కార్డులు బ్యాంక్ డెబిట్ కార్డు ,ఏటీఎం తరహా ఉంటుందన్నారు .స్మార్ట్ ఈ పాస్ మిషన్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తేనున్నదని ,ఇప్పుడున్న స్మార్ట్ కార్డులను ఈ యంత్రం ద్వారా స్వైప్ చేస్తే వివరాలు వస్తాయన్నారు.దీనివల్ల గతంలో యంత్రాలతో వచ్చిన సర్వర్ సమస్యలు ఉండవని తెలియజేశారు.సరుకులు తీసుకున్న వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి సమాచారం అందుతుందన్నారు.
లబ్ధిదారుడు క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో సరుకులు తీసుకున్న సమాచారం మొత్తం తెలుసుకోవచ్చాన్నారు. సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నెంబర్ 1967లో సంప్రదించవచ్చని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు.తాజా పరిణామాలతో రేషన్ పంపిణీ వ్యవస్థ నూతన సాంకేతిక మార్పులతో అత్యంత పకడ్బందీగా అమలు జరుగుతుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీనుమణి బాబు, పోతుల మోహనరావు, బుర్రి సత్తిబాబు, పాండ్రంగి రాంబాబు, బసవ చిన్నబాబు, మండపాక అప్పన్న దొర, అధిక సంఖ్యలో కూటమి నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo