కాకినాడ జిల్లా జగ్గంపేట నూతనంగా జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షుడిగా నియమితులైన జీనుమణి బాబును స్థానిక శ్రీరామ నగర్ లో జగ్గంపేట కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మూర్తి, గండేపల్లి మండల అధ్యక్షులు ఎస్కే నూరుద్దీన్ భాష ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మణి బాబు మాట్లాడుతూ పేదవారు అనారోగ్యంగా ఉంటే నిత్యం అందుబాటులో ఉంటూ ప్రాథమిక వైద్య సేవలు అందించే ఆర్ఎంపీ డాక్టర్స్ కి ప్రభుత్వం నుండి ఈ సహాయ సహకారాలు కావలసిన అందిస్తానని అన్నారు. ఆర్.ఎం.పి డాక్టర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమ అసోసియేషన్ కి సొంత స్థలం ఉంది భవన నిర్మాణానికి ప్రభుత్వం నుండి సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దీప్తి స్కానింగ్ అధినేత వెలిశెట్టి బుజ్జి, దేవరపల్లి మూర్తి, పిలా మహేష్, చెలికాని హరిగోపాల్, మండల పిఎంపి ప్రెసిడెంట్ ఎస్.కె నూరుద్దీన్ భాష సెక్రటరీ జగతా బాబ్జి ట్రెజరర్ ఏ సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు నాగరాజు దిడ్డిసుబ్బారావు కే కృష్ణ జగదీష్ శివ శ్రీనివాస్ ఎస్ కే వలి షా వీరబాబు ఏ సత్యనారాయణ చిన్న బాబు సభ్యులందరూ సన్మానించడం జరిగినది జగ్గంపేట గండేపల్లి మండలాల యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

