20 October 2025
Monday, October 20, 2025

మ‌రోసారి బ‌న్నీతో రష్మిక మందన్నా: AA22లో నేషనల్ క్రష్ సెన్సేషన్! !

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
విశ్వం వాయిస్ ఫిల్మ్ బ్యూసో,

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేరా’తో ఘన విజయాన్ని అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు సమాచారం. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమా AA22లో రష్మిక కీలక పాత్రలో కనిపించబోతుందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోణే ప్రధాన హీరోయిన్‌గా ఎంపిక అవడం, మిగతా క్యాస్టింగ్ మీద కూడా పాజిటివ్ బజ్‌ను కలిగించింది. తాజాగా రష్మిక మందన్నా పేరు కూడా ఫిక్స్ అయ్యిందనే న్యూస్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

‘పుష్ప’ సిరీస్‌లో బన్నీతో రష్మిక చూపిన కెమిస్ట్రీ అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఇప్పుడు AA22లో మళ్లీ ఆ జోడీ రీ యూనియన్ అవుతుందని తెలిసి అందరిలో ఎగ్జైట్మెంట్ పెరిగింది. దీపిక, రష్మికతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్ హీరోయిన్లను కూడా ఈ సినిమాలో తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ కాంబినేషన్లతో AA22 సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. బన్నీ కెరీర్‌లో ఇది మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిలవనుందనే మాట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి బన్నీ – రష్మిక కాంబినేషన్ మళ్లీ చూడబోతున్నామన్న వార్త అభిమానులకే కాకుండా, మొత్తం టాలీవుడ్‌కు గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు!

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo