ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
గండేపల్లి మండలం మురారి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాకతీయ కళ్యాణ మండపం పామ్ ఆయిల్ తోటల విస్తరణ మహోత్సవం శుక్రవారం జరగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించాయి. రైతులకు ఆయిల్ పామ్ మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పామ్ ఆయిల్ మొక్కలు నాటి మాట్లాడుతూ, పామాయిల్ పంట దేశానికి అవసరమైనదే కాకుండా, రైతుకు స్థిర ఆదాయం ఇచ్చే పంటగా నిలుస్తోంది. గండేపల్లి మండలంలోని రైతులు పామ్ ఆయిల్ సాగులో అందరికంటే ముందు వరుసలో ఉంటారని, పామ్ ఆయిల్ ఇక్కడనుండే పంటలు వేయడం ప్రారంభించడం జరిగిందని ఇక్కడి రైతులు పామ్ ఆయిల్ పంట సాగు చేయటంలో శాస్త్రవేత్తలు వంటివారు అని, నీటిసదుపాయాలు తక్కువ గా ఉన్నా పంట దిగుబడి ఏవిధంగా అత్యధికంగా తీయాలో వారికి బాగా తెలుసునని అని తెలిపారు.పతంజలి ప్లాంటేషన్ విభాగాధిపతి వి పట్టాభిరామి రెడ్డి మాట్లాడుతూగండేపల్లి మండలంలో దాదాపుగా ప్రతి ఊరికి ఒక గెలలు సేకరణ కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు అతి దగ్గరగా కొనుగోలు కేంద్రాలు ఉండేట్లు చర్యలు తీసుకొని ఉన్నామని, రైతులకు సేవ చేయటంలో పతంజలి సంస్థ యాజమాన్యం ఎన్ని ఆర్ధిక సవాళ్లు ఎదురైనా ముందుకే సాగుతొందని తెలియజేశారు. నూనె గింజల పంటలు అన్నింటి కంటే ఆయిల్ పామ్ పంట నుండే అత్యధిక దిగుబడి వస్తుందని చెప్పారు. ఆయిల్ పామ్ పంట ద్వారా అటు రైతులు, ఇటు కౌలురైతులు సుస్థిరమైన ఆర్ధికాభివృది సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.కాకినాడ జిల్లా ఏపీ ఎమ్ ఐ పి డి జీవీ వి వరప్రసాద్ ప్రసంగిస్తూ గండేపల్లి మండలం పామ్ ఆయిల్ సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటుందని, రైతులు ఈ పంటను సాగు చేయటంలో డ్రిప్ పద్ధతి ద్వారా నీరు మరియు ఎరువులు అందించే విదంగా చెస్తే అత్యధిక దిగుబడి సాధించడం సులభం అని తెలిపారు. ప్రభుత్వం డ్రిప్ పరికరాలపై రాయితీలు ఇస్తోందని సవివరంగా తెలిపారు.జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి విజయలక్ష్మి మాట్లాడుతూ, పామ్ ఆయిల్ సాగులో గండేపల్లి మండలం అగ్రగామిగా ఉంది అని, మండలంలో సుమారుగా 5700 హెక్టార్లలో పామ్ ఆయిల్ సాగులో ఉన్నదని తెలిపారు. ప్రభుత్వం క్రొత్తగా పంట వేసిన రైతులకు పతంజలి కంపెనీ ద్వారా ఉచితంగా మొక్కలు ఇస్తోందని తద్వారా రైతుకు మొక్కలు రూపేణా హెక్టారుకు 29000, ఎరువులు రూపంలో మొదటి నాలుగు సంవత్సరాలకు 21000 మరియు అంతర పంటల రూపంలో మరియొక 21000 అందచేస్తోందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్, కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, వైస్ ఎంపీపీ కుంచే రాజా, సీనియర్ నేతలు మరిశెట్టి భద్రం, కందుల చిట్టిబాబు, గండేపల్లి సొసైటీ చైర్మన్ కంటిపూడి సత్యనారాయణ, మురారి గ్రామ ఉప సర్పంచ్ శ్రీ జాస్తి వసంత్ కుమార్ సుంకవిల్లి రాజు జగ్గంపేట వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు జి శ్రీనివాస్ జగ్గంపేట ఉద్యాన అధికారిని ఏ శ్రీవల్లి గండేపల్లి ఎండిఓ చంద్రరావు గండేపల్లి ఎంపీపీ చలగల్ల దొరబాబు వ్యవసాయ అధికారి రెడ్ల శ్రీరామ్, పతంజలి సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ వీర్రాజు, ఫీల్డ్ ఆఫీసర్ టీవీఎస్ మణింద్రా క్లస్టర్ ఇంచార్జ్ వి నరేశ్ ఫీల్డ్ సూపర్వైజర్ బి దుర్గా ప్రసాద్ పతంజలి సంస్థ సిబ్బంది, ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.