ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట డి ఫిట్నెస్ జిమ్ అధినేత తాండ్రోతు వీర వెంకటరమణ ఆధ్వర్యంలో జగ్గంపేట నుండి గుంటూరులో ఆగస్టు9,10 తేదీలలోజరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో జగ్గంపేట విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించిన బి తేజస్విని, సిల్వర్ మెడల్ సాధించిన కె యేసు రాజు, రజతం సాధించిన ముగ్గురు విద్యార్థులు బి నిఖిల్ సాత్విక్, టీ వైష్ణవి ను ,పి .జైపాల్ లను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందించారు. వీరిలో గోల్డ్ మెడల్ సాధించిన భాష్యం స్కూల్ విద్యార్థిని బి తేజస్విని, సిల్వర్ మెడల్ సాధించిన గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థి కే ఏసు రాజు వీరిని హర్యానాలో సెప్టెంబర్10, నుండి 14వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ జూడో పోటీలకు ఈ విద్యార్థులు ఇద్దరు సెలెక్ట్ అవటంతో ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేసి జాతీయ స్థాయిలో కూడా వీరు రాణించి జగ్గంపేటకు మీ మాస్టర్ వెంకటరమణ కు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. జగ్గంపేట నుండి అనేక అవార్డులు తీసుకొస్తూ రాష్ట్రస్థాయిలోను జాతీయ స్థాయిలను జూడో పోటీలకు విద్యార్థులను తయారు చేస్తున్న కరాటే మాస్టర్ వెంకటరమణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, కోచ్ కే సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.