జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లపై నిఘాను పెంచడమేకాక, వారి పునరవాసానికి పోలీసు విభాగం నడుం కట్టింది. ఈ నేపథ్యంలో జగ్గంపేట సర్కిల్ పరిధిలోని కిర్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కె. మరియు కిర్లంపూడి ఎస్‌ఐ ఎస్ ఐ గోలి సతీష్ పాల్గొన్నారు. జగ్గంపేట సిఐ వై ఆర్ కె మాట్లాడుతూ రౌడీషీటర్లు గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం తీసుకుని ఇకపై సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు. ఎవ్వరైనా మళ్లీ ఏవైనా గొడవలు, దౌర్జన్య ఘటనలు, సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించే ఘటనల్లో పాల్గొంటే, వారి బెయిలు రద్దు చేసి మళ్లీ జైలుకు పంపించే చర్యలు తీసుకుంటామని హితవు పలికారు.అలాగే ఎవరైనా నిజంగా మారి నిబద్ధతతో సామాజిక స్పూర్తితో జీవితం గడిపితే వారి మీద ఉన్న రౌడీషీట్లు పరిశీలించి తొలగించే అవకాశముందని అధికారుల మాట.ఈ కౌన్సిలింగ్‌లో పలువురు రౌడీషీటర్లు హాజరయ్యారు. వారిలో కొందరు తమ తప్పులను స్వీకరించి, ఇకపై చట్టాన్ని గౌరవిస్తూ జీవించనున్నట్లు హామీ ఇచ్చారు.