చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అనేక సంస్కరణ లను తీసుకొస్తున్నాం
జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో హిందూ భావజాలంపై, తిరుమల పవిత్రతపై చేసిన దాడులను తీవ్రంగా ఖండించారు.నెహ్రూ పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో తిరుమల ప్రాంతంలో అనేక అవకతవకలు జరిగాయి అన్నారు. ఆలయ భూములు, ఆస్తుల విషయంలో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని టీటీడీ భూముల ఆక్రమణ, అమ్మకాలు జగన్ పాలనలోనే ఎక్కువగా జరిగాయని విమర్శించారు.భక్తుల విరాళాలను దుర్వినియోగం చేస్తూ, టీటీడీ నిధులను ప్రభుత్వ అవసరాలకు మళ్లించడం అనైతికమనిమండిపడ్డారు.అదే సమయంలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తొమ్మిది రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు నెహ్రూ వెల్లడించారు. ఆయా రాష్ట్రాలు స్థలాలు కేటాయిస్తే, టీటీడీ నిధులతో ఆలయాల నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు.అలిపిరి ఘాటులో 25 ఎకరాల్లో భక్తుల కోసం వసతి గృహాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు.టైమ్ స్లాట్ పద్ధతిలో ఉచిత బస్సుల సదుపాయం కల్పించి, గంటన్నరలోనే వైకుంఠం 3 కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనం జరుగుతుందని వివరించారు.ప్రతిరోజూ 80 వేలకుపైగా భక్తులు, కల్యాణకట్టకు 30 వేలమంది పైగా వస్తున్నందున కొత్త మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఆధార్ ఆధారిత విధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మానిటరింగ్ ద్వారా వేగవంతమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు.తప్పుడు ఆరోపణలపై ఖండన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని నెహ్రూ తేల్చిచెప్పారు. ఆయనకు ఉన్న కోటా టికెట్లు ఒక్కరోజు కూడా వాడలేదు. అయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది తిరుమలపై బురదజల్లడమేఅని అన్నారు.జగన్ ప్రభుత్వంపై విమర్శలుజగన్ రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. “హిందూ మతంపై జగన్‌కు నమ్మకం లేదు. ఆయన పాలనలోనే దర్శనం టికెట్లను అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి” అని ధ్వజమెత్తారు.చివరగా నెహ్రూ పిలుపునిస్తూ హిందూ సంప్రదాయాలను కాపాడటం, తిరుమల పవిత్రతను నిలబెట్టడం మా ధర్మం. జగన్ ప్రభుత్వం చేస్తున్న హిందూ వ్యతిరేక చర్యలపై ప్రతి భక్తుడూ అప్రమత్తం కావాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, నియోజవర్గ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ భూపాలపట్నం ప్రసాద్ పాల్గొన్నారు.

