కాకినాడ జిల్లా జగ్గంపేట సత్య సాయి బాబా డ్రింకింగ్ వాటర్ కార్మికులు గత 20 నెలలుగా జీతాలు లేక నిరవధిక సమ్మె చేయడంతో జగ్గంపేట నియోజకవర్గం లోని గోకవరం మండలం, రాజనగరం నియోజకవర్గం లోని కోరుకొండ, రాజానగరం మండలాలకు త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి రావడంతో సోమవారం జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జిల్లా పరిషత్ సీఈవో, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, డి ఈ, జేఈ, కాంట్రాక్టర్, కార్మికులతో కలిసి సమావేశం నిర్వహించారు. కార్మికులకు తక్షణం 50 శాతం జీతాలు చెల్లించాలని వెంటనే విధుల్లోకి తీసుకుని ఈ రోజు నుండి సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించి సమస్యను పరిష్కరించారు. గత కొద్దికాలంగా త్రాగునీరు లేక ఇబ్బంది గురవుతున్న గోకవరం, కోరుకొండ, రాజానగరం ప్రజలు సమస్య పరిష్కారమైందని తెలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కాంట్రాక్టర్, సత్య సాయి బాబా డ్రింకింగ్ వాటర్ కార్మికులు పాల్గొన్నారు.