ఉద్యోగ భాద్యతలను అంకిత భావంతో పని చేసిన వ్యక్తి మేడవరపు సూర్య భాస్కరరావు అని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, జగ్గంపేట ఎంపిపి అత్తులూరి నాగబాబు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యులు, మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం అన్నారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ ఎంపిడిఓ గా పని చేసిన సూర్య భాస్కరరావు గురువారం పదవి విరమణ చేశారు. స్థానిక గోకవరం రోడ్డులోని శివ పార్వతి ఫంక్షన్ హాల్ లో జగ్గంపేట ఎంపీడీవో ఏవీఎస్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సన్మాన సభకు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. 1981 సంవత్సరంలో బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో లైబ్రేరియన్ జాయిన్ అయ్యిన సూర్య భాస్కరరావు వివిధ మండలాల్లో పంచాయితీ కార్యదర్శి గా పనిచేశారు. అలాగే ఈఓ పి ఆర్డీ గా పదోన్నతి పొంది వివిధ మండలాల్లో పనిచేసి జగ్గంపేట లో పదవి విరమణచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో మేడవరపు సూర్య భాస్కరరావు, నాగ సుజాత దంపతులను పూలమాలతో, శాలువాలతో సత్కరించి పలువురు జ్ఞాపిక అందించారు. ఈ సన్మాన సభలో అతిథులు మాట్లాడుతూ అతి తక్కువ సమయం జగ్గంపేట లో పనిచేసిన అందరి మన్ననలు పొందారని. అంకిత భావం, క్రమశిక్షణతో 43 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారని ఆయనతో పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఉద్యోగులు జగ్గంపేట చేరుకుని ఘనంగా సన్మానించారు. సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ 43 సంవత్సరాల సుదీర్ఘకాలం నాకు అన్ని విధాలా సహకరించిన నా సహచర ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట గండేపల్లి ఏపీవోలు, జగ్గంపేట పంచాయతీ సెక్రెటరీ శివ, రాజపూడి, మల్లిశాల, సర్పంచ్ లు బుసాల విష్ణుమూర్తి, సర్వసిద్ధి లక్ష్మణరావు, తదితర సర్పంచ్లు, టిడిపి నాయకులు, మండలంలోని పంచాయతీ సెక్రెటరీలు,తదితరులు పాల్గొన్నారు.