Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications

అంగరంగ వైభవంగా గోకవరం సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గాజింగం సత్తిబాబు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

భారీ ర్యాలీతో, వందలాది మోటార్ సైకిల్ తో ర్యాలీగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి వెళ్లి బాధ్యత స్వీకరించిన గాజింగం సత్తిబాబు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

గోకవరం సొసైటీ చైర్మన్ గా గోకవరం గ్రామానికి చెందిన గాజింగం సత్తిబాబు సభ్యులుగా కొత్తల వీర అప్పారావు, వాకాడ కాటమాస్వామి ప్రమాణ స్వీకారం గురువారం సూర్య ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా చైర్మన్ సత్తిబాబు ఇంటి వద్ద నుండి వందలాది బైకులతో, మంగళ వాయిద్యాలతో భారీ బాణాసంచా కాల్పులతో గోకవరం మండలంలోని కూటమి నాయకులు అందరూ భారీ ఊరేగింపుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, చైర్మన్ గాజింగం సత్తిబాబు ఓపెన్ టాప్ జీపు ఫై ప్రజలకు అభివాదం చేస్తూ గోకవరం సొసైటీ వద్దకు చేరుకున్నారు. అక్కడ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్య ఫంక్షన్ హాల్ లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. అనంతరం వందలాదిగా తరలివచ్చిన అభిమానులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను, చైర్మన్ సత్తిబాబును గజమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ నాపై నమ్మకంతో గోకవరం సొసైటీ చైర్మన్ నియమించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నమ్మకాన్ని వమ్మి చేయకుండా సొసైటీని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గోకవరం సొసైటీకి మంచి వ్యక్తులను ప్రీమియం కమిటీగా నియమించడం జరిగిందని సొసైటీని అన్ని రకాల గా అభివృద్ధి చేసే చైర్మన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించుతున్నారని మళ్లీ ఎన్నికల్లో కూడా వీరినే పోటీ చేస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా అందిస్తూ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కుటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో గాజింగం సత్తిబాబు అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo