Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

అత్యధిక కేసులు పరిష్కరించిన జగ్గంపేట ఎస్సై రఘునాథరావుకు ఎస్పీ అభినందనలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేటలో 116 కేసులు పరిష్కారం — లోక్అదాలత్‌లో విశేష ఫలితాలు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎస్సై టి. రఘునాథరావు నిర్వహించిన కృషికి గుర్తింపు లభించింది.ఈనెల 5వ తేదీన నిర్వహించిన మెగా జాతీయ లోక్అదాలత్‌లో మొత్తం 116 కేసుల పరిష్కారానికి రఘునాథరావు ముఖ్య పాత్ర పోషించారు.కక్షిదారులు, ఫిర్యాదుదారులు, ఇరు వర్గాల వ్యక్తులను పరస్పర సమన్వయంతో కలిపి, సమాధానమార్గాలను సూచిస్తూ వారిని న్యాయపరంగా ఒప్పించి, కేసుల పరిష్కారానికి సహకరించడం ద్వారా జగ్గంపేట పోలీస్‌ స్టేషన్‌కు జిల్లాలో ప్రథమ స్థానం తెచ్చిపెట్టారు.ఈ ఘనతకు గుర్తింపుగా, శుక్రవారం (జూలై 25న) కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఎస్సై రఘునాథరావును అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “జగ్గంపేట పోలీస్‌స్టేషన్‌ మాదిరిగానే, జిల్లా నలుమూలలా పోలీసులు ప్రజలతో మమేకమై సమస్యలు చక్కదిద్దే దిశగా కృషి చేయాలని” పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసు శాఖలోని ఇతర సిబ్బంది ఎస్ఐ రఘునాథరావుకు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo