సామాజిక ఉద్యమకారుడు
పాటంశెట్టి సూర్యచంద్ర
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను మానవత్వంతో అందించాలంటూ సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మంచానికే పరిమితమైన ప్రతి ఒక్కరికి నెలకు ₹15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే, తాజాగా సంబంధిత అధికారులు అనేక నిబంధనలు చూపించి అర్హులను నిరాశకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గోకవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ చినరాముడు కలిసి సమస్యను వివరించిన పాటంశెట్టి సూర్యచంద్ర, 100% దివ్యాంగుడైన గుమ్మల్లదొడ్డి గ్రామానికి చెందిన ఇంజరపు రాంబాబు, మంచానికే పరిమితమైన అచ్యుతాపురం గ్రామస్తులు కోలా శివాజీ, బండారు వెంకటరమణల కోసం పింఛన్లను మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.వారి పరిస్థితులను స్వయంగా సమీక్షించిన జాయింట్ కలెక్టర్ చినరాముడు, మానవీయ కోణంలో స్పందిస్తూ సంబంధిత అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు