Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ప్రారంభించిన జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట నియోజకవర్గంలో 30,820 మంది రైతులకు ₹20.81 కోట్లు మంజూరు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే తో కలిసి రైతులు ధాన్యాభిషేకం నిర్వహించారు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ముందుగా జగ్గంపేట మండలం వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధాన్యాభిషేకం నిర్వహించారు. అనంతరం 30 వేల 820 రైతుల ఖాతాలో 20 కోట్ల 81 లక్షలు రూపాయలు చెక్ రూపంలో రైతులకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకంలో భాగంగా నియోజవర్గం రైతులందరికీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి లో రైతుల ఖాతాలో అమౌంట్ జమ చేస్తున్నారని అందులో భాగంగా ఇక్కడ కూడా రైతులందరికీ వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని అన్నారు. ఈరోజు రైతుల కోసం ఆధునిక యంత్రాలు తీసుకొచ్చి కుటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని అందులో భాగంగా నియోజకవర్గంలో పదికి పైనే డ్రోన్లు అందజేయడం జరిగిందని, అదేవిధంగా టాక్టర్స్, పవర్ టిల్లర్స్, వరి కోత మిషన్లు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని రైతులకు న్యాయమైన విత్తనాలు, పురుగుమందులు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో యూరియాతో సహా అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. రైతులకు చంద్రబాబు చేస్తున్న మేలుకు ఈ రోజు వారు ధాన్యాభిషేకం చేయడం రైతులపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ కడప భరత్ , ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, మారిశెట్టి భద్రం, సొసైటీ చైర్మన్లు బుర్రి సత్తిబాబు, ఉప్పలపాటి బుల్లెబ్బు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల వ్యవసాయ జగ్గంపేటఎస్.నరసింహం,కిర్లంపూడి – ఎన్. సుధా మాధురి,గండేపల్లి ఆర్.శ్రీరామ్,గోకవరం పి. రాజేశ్వరి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo