స్థానిక కాకినాడ రోడ్ లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం రాజమండ్రి వాస్తవ్యులు కీర్తిశేషులు స్వర్గీయ చక్కపల్లి సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమార్తె, అల్లుడు, మనవడు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, అనీష్ నెహ్రూ ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అనీష్ నెహ్రూ మాట్లాడుతూ మా తాత స్వర్గీయ చక్కపల్లి సత్యనారాయణ జ్ఞాపకార్థం సోమవారం జగ్గంపేట అన్న క్యాంటీన్ పేదలకు అన్నదానం నిర్వహించామని తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వ అన్న క్యాంటీన్ ఏర్పాటు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జంపన రవి వర్మ, వేములకొండ జోగారావు, సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ (యల్లమిల్లి సీఎం) దాపర్తి సీతారామయ్య, డేగల సత్తిబాబు, అరటా పోలీస్, షేక్ వల్లి, మారిశెట్టి గంగ, పుర్రె వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

