Monday, August 11, 2025
Monday, August 11, 2025

ఆగస్టు 15న గోకవరంలో మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు ఆహ్వానం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం డిపో నుండి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించేందుకు గోకవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సుచరిత మార్గరెట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే నెహ్రూ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూసూపర్‌ సిక్స్‌’ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈనెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. ఆ రోజు నుంచి మహిళలు ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అని అన్నారు. ‘మన రాష్ట్రానికి చెందిన మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్లు.. ఆధార్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డును చూపించి.. పల్లెవెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే నాన్‌స్టాప్ అంతర్రాష్ట్ర సర్వీసులు, ఇతర కేటగిరీ బస్సులకు, కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ సర్వీసులు, చార్టెడ్‌ సర్వీసులు, ప్యాకేజీ టూర్లకు ఇది వర్తించదు. అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలోసీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్.. ఏ. అప్పారావు, ఎస్ ఎమ్ రావు ఎడిసి, కార్మిక పరిషత్ యూనియన్ నాయకులు. వీరభద్రరావు.జంగేటి ,పదిలం శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ పూలపర్తి బుజ్జి, దొర తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
అలూరి సీతారామరాజు
సినీ వాయిస్
టెక్నాలజీ
సక్సెస్ వాయిస్
తెలంగాణ
తీర్పు వాయిస్
క్రీడా వాయిస్
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo