Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నివారణకు డ్రోన్ నిఘా చర్యలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట సర్కిల్ పోలీసుల సరికొత్త చర్యలు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జగ్గంపేట సర్కిల్ పోలీసు శాఖ విద్యార్థుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలలు మరియు కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి సంఘటనలు ఎదుర్కొనకుండా ఉండేందుకు తాజా టెక్నాలజీని వినియోగిస్తోంది.ఈ దిశగా, సర్కిల్ పరిధిలోని అన్ని పాఠశాలలు మరియు ప్రైవేట్ కళాశాలల వద్ద ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో డ్రోన్ల సహాయంతో నిఘా చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానితులను గుర్తించడం, విద్యార్థులు ప్రత్యేకంగా విద్యార్థినులు భద్రతగా ఉన్నారని నమ్మకం కలుగజెయ్యడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం.బుధవారం జగ్గంపేట మండలంలోని రాజపూడి హైస్కూల్ వద్ద డ్రోన్ కెమెరా ద్వారా పరిసర ప్రాంతాల్లో నిఘా నిర్వహించారు. డ్రోన్ పర్యవేక్షణతో పాటు పోలీసు బృందాలు కూడా పటిష్టమైన పెట్రోలింగ్ చేపట్టాయి. ఇది విద్యాసంస్థల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలలో ఒక భాగంగా చేపట్టారు.జగ్గంపేట సీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చర్యలతో విద్యార్థుల్లో భద్రతాభావం పెరిగి, సమాజంలో మంచి సందేశం వెళ్లింది. ప్రజలు కూడా ఈ చర్యలను ప్రశంసిస్తున్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo