విధి నిర్వహణలో విశిష్ట సేవలందించిన జగ్గంపేట సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంస పత్రం లభించింది.కాకినాడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, కాకినాడ జిల్లాలో ప్రతిభ కనబరిచిన ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్ హాజరై, జగ్గంపేట సిఐ వై.ఆర్.కె శ్రీనివాస్‌కు ప్రశంస పత్రాన్ని అందజేశారు.