హైదరాబాదులో గుర్తించిన గండేపల్లి పోలీసులు
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ జిల్లా వ్యాప్తంగా మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఉమెన్ మరియు గర్ల్స్ మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో, గండేపల్లి మండలం సింగరంపాలెం గ్రామానికి చెందిన ఒక వివాహిత మహిళ అనామిక ఈ నెల 18వ తేదీన ఇంటి నుండి కనిపించకుండా పోయిన ఘటనపై గండేపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది.ఎస్పీ ఆదేశాల మేరకు గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటుచేయబడింది. తగిన ఇంటిలిజెన్స్ సేకరణ, సాంకేతిక సహాయంతో అనేక ప్రాంతాల్లో గాలింపు చేపట్టి చివరకు అనామికను హైదరాబాదులో సురక్షితంగా ట్రేస్ చేసి తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ గండేపల్లి పోలీసుల చర్యను ప్రశంసించారు. మిస్సింగ్ కేసులపై పోలీసులు తీసుకుంటున్న వేగవంతమైన స్పందన ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నదని వారు పేర్కొన్నారు.