ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలో పాత్రికేయులు నిరసన తెలిపారు. ఆగస్టు 5 న జర్నలిస్టుల డిమాండ్స్ డే గా నిర్వహించాలని రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపుమేరకు జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ఏపియు డబ్ల్యుజె సభ్యులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి తహసీల్దార్ చిరంజీవికు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కిర్లంపూడి మండల అధ్యక్షులు మరియు జిల్లా కమిటీ సభ్యులు గండే కొండారావు(నాని) జిల్లా కమిటీ సభ్యులు నేదూరి లక్ష్మణరావు, వైస్ ప్రెసిడెంట్ ముద్రగడ రమేష్, కోశాధికారి ఆడారి సురేంద్ర, సభ్యులు టీ. వి.వి కృష్ణ, పడాల శివ మరియు పాత్రికేయ మిత్రులు అందరూ పాల్గొన్నారు.