Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

ఏ వన్ ఫిల్టర్ వాటర్, వాటర్ సర్వీసింగ్ సెంటర్ ల ను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట శివారు జాతీయ రహదారి వద్ద ఐ వీరబాబు, నూతనంగా ఏర్పాటు చేసిన ఏ వన్ ఫిల్టర్ వాటర్, వాటర్ సర్వీసింగ్ సెంటర్ లను జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వసక్తితో పైకి రావాలని ఉద్దేశంతో వీరబాబు నూతనంగా ఏర్పాటు చేసిన ఏ వన్ శుద్ధి చేసిన మంచినీరు పంపిణీ కేంద్రంతోపాటు వాటర్ సర్వీసింగ్ సెంటర్ ని కూడా పెట్టి తను జీవిస్తూనే మరికొందరికి జీవనోపాధి కల్పించడం చాలా అభినందించదగ్గ విషయమని వీరబాబు ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి పొందే విధంగా అడుగులు వేయాలని దానికి ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. వీరి నూతన వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది మరి అంత ఉన్నత స్థితికి వెళ్లాలని దీవించారు. మరో అతిధి కందుల చిట్టిబాబు మాట్లాడుతూ తన కాళ్ళపై తాను నిలబడాలని ఉద్దేశంతో చేస్తున్న ఈ యొక్క చిరు ప్రయత్నం విజయవంతమై పలువురికి ఉపాధి కల్పించే స్థాయికి వీరబాబు వెళ్లాలని ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో రాగంపేట సొసైటీ చైర్మన్ కందుల కొండయ్య చౌదరి (బాబ్జి), రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, మురారి ఉప సర్పంచ్, క్లస్టర్ ఇంచార్జ్ జాస్తి వసంత్, ఉప్పలపాడు సర్పంచ్ అడబాల ఆంజనేయులు, టిడిపి యువనేత పాలచర్ల నాగేంద్ర చౌదరి, నీలాద్రి రావు పేట గ్రామ టిడిపి అధ్యక్షు కురుకూరి వీర వెంకట చౌదరి, కంటే సురేంద్ర, కందుల వినయ్, ఉండవల్లి వరప్రసాద్. మండపాక అప్పన్న దొర,పైడిమళ్ల సురేంద్ర, యం యోబు ,లాజరస్, వెలిశెట్టి రాంబాబు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo