Wednesday, August 6, 2025
🔔 10
Latest Notifications
Wednesday, August 6, 2025
🔔 10
Latest Notifications

కాట్రావులపల్లిలో మెగా రక్తదాన శిబిరం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ జన్మదినం సందర్భంగా ఘన కార్యక్రమం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జగ్గంపేట మండలంలోని కాట్రావులపల్లిలో ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక యువత ఆధ్వర్యంలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పసుపులేటి పవన్ కుమార్ నేతృత్వంలో ‘టీం రాజేష్’ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ, “కల్లేపల్లి రాజేష్ వ్యాపార రీత్యా విదేశాల్లో ఉన్నా, తన సొంత గ్రామంపై ఉన్న మమకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలి,” అని సూచించారు.
రక్తదాన శిబిరం ముగిశిన అనంతరం జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో రమేష్ పాల్గొని కల్లేపల్లి రాజేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని రాజా విలాస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో 86 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్, కాట్రావులపల్లి సేవా సమితి సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహకరించాయి. వైద్యులు రక్తదాతల నుంచి శుభ్రంగా, క్రమబద్ధంగా రక్తాన్ని సేకరించారు.కేవలం రక్తదానంతో కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయడంతో పాటు, గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ చర్యలు గ్రామ ప్రజల్లో మంచి స్పందనకు దారితీశాయి. సేవా కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి.రాజేష్ అభిమానులే నేటి ప్రాణదాతలు. గ్రామంలోనే 100 మందికి పైగా యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం సంతోషకర విషయం,” అని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు రాజేష్ తెలిపారు.పుట్టినరోజును ఒక సాధారణ వేడుకలా కాకుండా, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలుగా జరపాలన్నదే మా ఉద్దేశ్యం,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్ట సుగుణరావు, మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య, నీటి సంఘం అధ్యక్షులు కంటే రామారావు, బూరుగుపూడి మాజీ సర్పంచ్ పాఠం శెట్టి సూర్యచంద్ర, తోలాట వీరబాబు , సేవా సమితి సభ్యులు మద్దూరి ప్రసాద్, సుంకర తారక్, పార్సి వేణు, కర్రీ శ్రీనివాస్ రెడ్డి, సముద్ర ఫ్లెక్స్ అండ్ ప్రింటింగ్ గణేష్ సహా అనేకమంది జనసేన కార్యకర్తలు, టీం రాజేష్ సభ్యులు విరివిగా పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తూర్పు గోదావరి
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo