కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్, ఆదేశాల మేరకు శుక్రవారం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ గండేపల్లి ఎస్సై శివ నాగబాబు, స్థానిక పోలీస్ సిబ్బంది, క్యూ ఆర్ టీ టీమ్‌లు పాల్గొన్నారు.ఈ చర్యలో భాగం గా తనిఖీల్లో రికార్డుల్లేని 13 మోటార్ బైకులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే 400 లీటర్ల అక్రమ బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, ప్రజల్లో భద్రతా భరోసా కలిగించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు.జనాల్లో నేర మాఫియా మీద భయాన్ని పోగొట్టేందుకు ఇటువంటి కార్డెన్ ఆపరేషన్లు పటిష్టంగా కొనసాగుతాయని సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు.