గ్రామంలో జబర్దస్త్ ఫ్రేమ్ సందడి
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ప్రజల త్రాగునీటి అవసరాల కోసం ఎన్ ఆర్ ఐ రాజేష్ కల్లేపల్లి సమకూర్చిన మంచినీటి పథకాన్ని గురువారం సాయంత్రం జబర్దస్త్ పేమ్ హైపర్ ఆది టీం,రాజేష్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ప్రారంభించారు.గ్రామంలో ప్రజలు త్రాగునీటి కోసం దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు రూ.20 లక్షలు కల్లేపల్లి రాజేష్ సొంత నిధులు సమకూర్చి త్రాగునీరు అందించేందుకు బోరును ఏర్పాటు చేసి ఏగులమ్మ తల్లి గుడి వద్ద ఉన్న వాటర్ ట్యాంకుకు అనుసంధానం చేశారు.ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ కాట్రావులపల్లిలో ఏ సమస్య వచ్చినా ఒకటే పరిష్కారం మన కల్లేపల్లి రాజేష్ అన్నారు.
సాఫ్ట్వేర్ సమస్య వస్తే ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒంటికి సమస్య వస్తే ఒక డాక్టర్ ఉంటారు,అదేవిధంగా కాట్రావులపల్లి గ్రామానికి ఏదైనా సమస్య వస్తే మన రాజేష్ మన కల్లేపల్లి రాజేష్ ఉంటారని హైపర్ ఆది అన్నారు.
ఈ కార్యక్రమంలో కాట్రావులపల్లి గ్రామ సర్పంచ్ పిట్ట సుగుణ రావు,బూరుపూడి మాజీ సర్పంచ్ పాఠం శెట్టి సూర్యచంద్ర, సుంకర సీతారామయ్య,కంటే రామారావు,కల్లేపల్లి రాజేష్ తల్లి అచ్యుతం,కల్లేపల్లి రాజేష్ బావగారు శంకర్, అక్క జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు…

