రాజారావు నాల్గో వర్ధంతి సభలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతల పిలుపు
కాకినాడ జిల్లా జగ్గంపేటలో యాదవ కళ్యాణ మండపంలోసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ సాగంటి రాజారావు నాల్గవ వర్ధంతి సభ గురువారం మధ్యాహ్నం సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఘనంగా నిర్వహించారు.ఆ పార్టీ జిల్లా నాయకులు మరుకుర్తి ఏసు అధ్యక్షత నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన వర్తక న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా రాజారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించి, జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన రాజారావు యువకుడిగా ఉన్నప్పుడే విప్లవానికి ఆకర్షితుడయ్యాడని, పీడిత ప్రజల కోసం విప్లవద్యమంలో అనేక చిత్ర హింసలను, నిర్బంధాలను ఎదుర్కొని, జైలు జీవితం గడిపి తుది శ్వాస విడిచే వరకు పీడితే ప్రజల పక్షాన నిలబడి పోరాడాడని కొనియాడారు.
ఆత్మ రక్షణాదళ సభ్యుడిగా చేరిన రాజారావు దళ కమాండర్ గాను, జిల్లా నాయకుడిగాను ఎదిగారని స్లాగించారు.
జిల్లాలో రైతు కూలీ సంఘం అధ్యక్షుడిగా అనేక భూ పోరాటాలకు, కూలిపోరాటాలకు నాయకత్వం వహించాడని తెలియజేశారు.ఆయన మరణం విప్లవోద్యమానికి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.నేటి తరానికి ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శమన్నారు. అనంతరం న్యూడెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశ ప్రజలపై సాగుతున్న దోపిడి, పీడనలు పోవాలంటే విప్లవం తప్ప మరో మార్గం లేదని, విప్లవ పార్టీలలోను, విప్లవ ప్రజా సంఘాల లోను ప్రజలు సమీకృతమై తమపై సాగుతున్న అన్యాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 78 ఏళ్ల స్వా(హా)తంత్ర భారతంలో ఈ దేశ పాలకులు ఆకలి, దారిద్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యతలను దేశ ప్రజలకు వరాలగా ఇచ్చారని,పెద్ద పెట్టుబడిదారులకు,గుత్త పెట్టుబడుదారులకు, కార్పొరేట్ శక్తులకు అంతులేని సంపదలను కూడ పెట్టారని విమర్శించారు.
కామ్రేడ్ రాజారావు ఆశయాల వెలుగులో ప్రజలు పార్టీ శ్రేణులు నడవాలని పిలుపునిచ్చారు. ఈ సభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి వెంకట్ నాయుడు, జె సత్తిబాబు, బొజ్జిరెడ్డి, భాస్కర్ రెడ్డి, జి ఆదినారాయణ, ఎం జేసు, ఆ రఘువులు, జి బాలరాజు, దుర్గారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.